Team India: మూడో టెస్టు కోసం ముమ్మర సాధన చేస్తున్న టీమిండియా... ఫొటోలు ఇవిగో!

Team India cricketers sweats in nets for third test
  • రేపటి నుంచి భారత్, ఆసీస్ మూడో టెస్టు
  • ఇండోర్ వేదికగా మ్యాచ్
  • ఇప్పటికే సిరీస్ లో 2-0తో భారత్ ఆధిక్యం
  • మూడో టెస్టు డ్రా చేసుకున్నా చాలు... సిరీస్ కైవసం
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి రెండు టెస్టులను చేజిక్కించుకున్న టీమిండియా... మూడో టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తోంది. ఈ టెస్టు మ్యాచ్ రేపు (మార్చి 1) ఇండోర్ లో ప్రారంభం కానుంది. రెండో టెస్టు తర్వాత సుదీర్ఘ విరామం చిక్కడంతో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. 

మూడో టెస్టును డ్రా చేసుకున్నా చాలు... సిరీస్ టీమిండియా వశమవుతుంది. అయినప్పటికీ, భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో, ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో భారత ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.
Team India
Australia
3rd Test
Indore

More Telugu News