Prahlad Modi: చెన్నై ఆసుపత్రిలో చేరిన ప్రధాని మోదీ సోదరుడు

PM Modis younger brother Prahlad Modi hospitalised for kidney treatment in Chennai
  • కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రహ్లాద్ మోదీ
  • చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేరిక
  • కుటుంబ సభ్యులతో కలసి తమిళనాడులో ఆధ్యాత్మిక పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ప్రహ్లాద్ మోదీ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. దీనికి చికిత్స తీసుకునేందుకే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. తమిళనాడులోని కన్యాకుమారి, మధురై, రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటనకు ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లినట్టు తెలిసింది. 

దామోదర్ దాస్ ముల్ చంద్ మోదీ, హీరాబెన్ దంపతులకు నాలుగో సంతానమే ప్రహ్లాద్ మోదీ. అహ్మదాబాద్ లో ఓ గ్రోసరీ స్టోర్, టైర్ షోరూమ్ నిర్వహిస్తున్నారు. గత డిసెంబర్ 27న కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ప్రహ్లాద్ మోదీ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలసి బందీపూర్ నుంచి మైసూర్ వెళుతుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైజ్ షాప్ డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. 
Prahlad Modi
Narendra Modi
younger brother
hospitalized
chennai

More Telugu News