Sri Vishnu: లవ్ లో హీరోగారికి వచ్చిపడిన ప్రోబ్లమ్ ఏంటబ్బా?.. 'సామజవరగమన' నుంచి గ్లింప్స్ విడుదల

Samajavaragamana Glimpse Released
  • శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'సామజవరగమన'
  • కథానాయికగా రెబ్బా మోనికా జాన్ 
  • దర్శకుడిగా రామ్ అబ్బరాజు పరిచయం 
  • సంగీతాన్ని అందించిన గోపీసుందర్
శ్రీవిష్ణు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అప్పుడే పుష్కర కాలమవుతోంది. ఈ ప్రయాణంలో ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'సామజవరగమన' సినిమా రూపొందుతోంది. రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాకి, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. 

శ్రీవిష్ణు బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇది కామెడీ టచ్ తో సాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టయినర్ అని తెలుస్తోంది. "ప్రేమించేవాళ్లకి క్యాస్ట్ ప్రోబ్లం వస్తుంది .. క్యాష్ ప్రోబ్లం వస్తుంది. ప్రపంచంలో ఎవరికీ రాని వింత ప్రోబ్లం నాకొచ్చిందేంట్రా" అనే హీరో డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాలో శ్రీవిష్ణు జోడీగా రెబ్బా మోనికా జాన్ కథానాయికగా అలరించనుంది. గోపీసుందర్ అందించిన సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీ విష్ణుకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

Sri Vishnu
Rebba Monika John
Samajavaragamana

More Telugu News