: రాష్ట్రంలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకకముందే తొలకరి జల్లులు రాష్ట్రాన్ని పలకరించాయి. నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరో 36 గంటల్లో ఆంధ్రప్రదేశ్ ను ఈ రుతుపవనాలు తాకనున్న నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ శంషాబాద్ లో భారీ వర్షం పడింది, రైల్వేస్టేషన్లో పిడుగుపడింది. పిడుగు ధాటికి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీర్ని ఆసుపత్రికి తరలించారు. మరో వైపు తిరుపతిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీని ధాటికి తుంగభద్రానది పొంగి పొర్లుతోంది. భారీ వరద నీటితో సుంకేశుల జలాశయం జలకళ సంతరించుకుంది.

More Telugu News