Ajay Bhupathi: 'మంగళవారం' మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్!

  • అజయ్ భూపతి నుంచి 'మంగళవారం'
  • హారర్ టచ్ నేపథ్యంలో నడిచే కథ 
  • ప్రధానమైన పాత్రలో పాయల్ అంటూ టాక్ 
  • 'మహా సముద్రం' తరువాత అయన చేస్తున్న సినిమా
Mangalavaram Title Poster Released

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో లవ్ .. రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వలన, యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఆ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. 

ఆ తరువాత లవ్ కి ఎమోషన్ ను యాడ్ చేసి ఆయన రూపొందించిన సినిమానే 'మహా సముద్రం'. సినిమా చూసిన వాళ్లంతా మణిరత్నం స్టైల్లో ఉందని అన్నారుగానీ, ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ ఫ్లాప్ తరువాత ఆయన కొంత గ్యాప్ తీసుకుని ఒక కథను రెడీ చేసుకున్నాడు. 

అజయ్ భూపతి సిద్ధం చేసుకున్న ఆ కథ పేరే 'మంగళవారం'. ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాలను రివీల్ చేయకుండా ఆయన టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో హీరోయిన్ ను ఆయన సీతాకోకచిలుక మాదిరిగా చూపించాడు. ఈ రోజున మంగళవారం కావడంతో, 'మంగళవారం' టైటిల్ లుక్ పోస్టర్ ను వదిలాడు. 

హారర్ టచ్ ఉన్న జోనర్లో ఈ కథ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే నాయిక ప్రధానమైన ఈ సినిమాలో పాయల్ ను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. స్వాతి - సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

More Telugu News