Kareena Kapoor: 42 ఏళ్లలోనూ కరీనా కపూర్ ఫిట్ నెస్ మంత్రం ఇదే!

Kareena Kapoor is burning with dedication as she sweats it out at the gym in new workout video
  • ఫిట్ నెస్ కోసం కఠోర సాధన చేస్తున్న కరీనా
  • ఫిట్ నెస్ తో పాటు అందాన్ని కాపాడుకుంటున్న నటి
  • శిల్పాశెట్టిదీ ఇదే దారి.. ఇన్ స్టాలో వీడియో పోస్ట్
నడి వయసుకు వచ్చినా.. యవ్వనంలో ఉన్నట్టు కనిపించాలంటే అందుకు ఎంతో శ్రద్ధ అవసరం. చక్కని పోషకాహారం, మితాహారం తీసుకోవాలి. రోజూ శారీరకంగా శ్రమించాలి. సరిపడా మంచి నిద్ర పోవాలి. ఇవన్నీ చేసినప్పుడు పెరుగుతున్న వయసు ఛాయలు అంతగా బయట పడవు. ఇక సినీ నటీ నటులు తమ అందం కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఎంతో శ్రమిస్తుంటారు. అందం ఉన్నంత వరకూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అందుకే వారు ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు.

బాలీవుడ్ నటి కరీనా కపూర్ పెళ్లయి ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి. 42 ఏళ్ల వయసులో ఆమె ఇప్పటికీ శారీరకంగా రోజూ శ్రమిస్తూ, ఫిట్ నెస్ కాపాడుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే నడి వయసులో ఆమె తన అందాన్ని ఎలా కాపాడుకుంటోందో గమనించొచ్చు. (ఇన్ స్టా వీడియో కోసం)

మరోవైపు శిల్పాశెట్టి కూడా ఫిట్ నెస్ ప్రియురాలే. తన వీడియోలతో అభిమానుల్లోనూ ప్రేరణనిస్తుంటుంది. తాను చేసే వర్కవుట్ వీడియోలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటుంది. తాజాగా గుండెకు సంబంధించిన వ్యాయామం చేస్తూ వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. (వీడియో కోసం)
 
Kareena Kapoor
Shilpa Shetty
fitness
gym
workout
vedio

More Telugu News