గన్నవరం కేసులో టీడీపీ నేత పట్టాభి బెయిల్ పిటిషన్ పై విచారణ
- ఇటీవల గన్నవరంలో ఉద్రిక్తతలు
- పట్టాభి తదితరులపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు
- తనను కులం పేరుతో దూషించారని ఆరోపణ
- పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు
- 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
కొన్నిరోజుల కిందట, గన్నవరంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, పట్టాభి తదితర టీడీపీ నేతలపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దాంతో, పట్టాభి సహా 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.