సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
- వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్
- వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
- బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సునీల్ యాదవ్
- ఈ దశలో బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు
వాదనల సందర్భంగా... సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుందని, హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు వివరించింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.