TDP: టీడీపీ సీనియర్ నేత జూలకంటి సంచలన ఆరోపణ

TDP leader julakanti alleges YCP hatching conspiracy against Key TDP leader
  • పల్నాడులో టీడీపీ నేత హత్యకు వైసీపీ కుట్ర పన్నుతోందన్న జూలకంటి
  • పోలీసు శాఖ అధికార పార్టీలో చేరిపోయిందని వ్యాఖ్య
  • భవిష్యత్తు పరిణామాలకు ప్రభుత్వం, వైసీపీదే బాధ్యత అని వ్యాఖ్య
మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్‌ జూలకంటి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడులో ఓ టీడీపీ నేత హత్యకు కుట్ర జరుగుతోందని వెల్లడించారు. ఓ పెద్ద టీడీపీ నేతను హత్య చేసేందుకు వైసీపీ పథకం వేస్తోందని సోమవారం ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పల్నాడులో పోలీసు శాఖ వైసీపీలో చేరిందని వ్యాఖ్యానించారు. 

కారంపూడి పోలీస్ స్టేషన్ తమ అడ్డా అంటూ టీడీపీ నేత నాగేశ్వరరావుపై కొందరు దాడి చేశారని జూలకంటి ఆరోపించారు. రోజుకొక గ్రామంలో అల్లర్లు సృష్టించే పనిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసిన జూలకంటి..ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ పరిణామాలకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
TDP
YSRCP

More Telugu News