Vijay: విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన విజయ్ కొత్త సినిమా

actor vijay new project creates records in pre release business
  • డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా రికార్డు వసూళ్లు
  • హిందీ శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడుతున్న ప్రముఖ కంపెనీలు
  • విజయ్, లోకేశ్ ల ‘లియో’ సినిమాపై పెరుగుతున్న అంచనాలు
వారిసు తర్వాత విజయ్ నటిస్తున్న కొత్త సినిమా లియో విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. డిజిటల్, ఆడియో, శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా రూ.400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సినిమా వర్గాల సమాచారం. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులు సృష్టిస్తోందని అంటున్నారు. కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ కోసమే నెట్ ఫ్లిక్స్ రూ.120 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది.

ఇక శాటిలైట్ హక్కుల కోసం సన్ టీవీ రూ.70 కోట్లు, ఆడియో కోసం సోని మ్యూజిక్ రూ.18 కోట్లు చెల్లించాయని సమాచారం. హిందీలో శాటిలైట్ హక్కులు దక్కించుకోవడం కోసం ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయట. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.240 కోట్లకు, థియేట్రికల్ రైట్స్ రూ.175 కోట్లకు అమ్ముడు పోయినట్లు సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా విజయ్, లోకేశ్ ల కొత్త సినిమా ‘లియో’ పై అంచనాలు పెరుగుతున్నాయి.

విడుదలకు ముందే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు తెచ్చిపెడుతోందని, విడుదలయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని అంటున్నారు. కాగా, విజయ్ నటించిన వారిసు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా రూ.300 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
Vijay
liyo
new movie
pre release
satilite rights
record collections

More Telugu News