Raghu Rama Krishna Raju: వారణాసిలో సతీసమేతంగా పూజలు నిర్వహించిన రఘురామకృష్ణరాజు

- వారణాసిలో పర్యటించిన రఘురామ
- కాశీ విశ్వనాథస్వామి ఆలయ సందర్శన
- ట్విట్టర్ లో ఫొటోలు పంచుకున్న వైనం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటించారు. ఇక్కడి కాశీ విశ్వనాథస్వామి ఆలయాన్ని సతీసమేతంగా సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను రఘురామ ట్విట్టర్ లో పంచుకున్నారు.
"ఈ రోజు ఉదయం వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారిని దర్శించుకున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ప్రార్థించాను. వారణాసిని ఎంతగానో అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.


