Air Ambulance: కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్... రోగి సహా ఐదుగురి మృత్యువాత

Five dead in Air Ambulance crash in Nevada
  • అమెరికాలో విషాద ఘటన
  • నెవాడా సరిహద్దుల్లో కూలిపోయిన ఎయిర్ అంబులెన్స్ విమానం
  • ప్రమాదం సమయంలో విమానంలో ఐదుగురు
  • అందరూ మరణించారన్న అధికారులు
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నెవాడాలో ఓ ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. రోగి కూడా మృత్యువాత పడినట్టు అధికారులు తెలిపారు. అమెరికాలో మంచు తుపాను విజృంభిస్తోంది. ఈ కారణంగా విమానం ప్రయాణించేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. 

కాగా, నెవాడా సరిహద్దుల్లోకి వచ్చేసరికి విమానం రాడార్ తో సంబంధాలు కోల్పోయింది. సెంట్రల్ లియోన్ కౌంటీలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎయిర్ అంబులెన్స్ విమానంలో పైలెట్, రోగి, రోగి సహాయకుడు, నర్సు, పారామెడికల్ నిపుణుడు ఉన్నారు. వీరందరూ ప్రాణాలు కోల్పోయినట్టు సెంట్రల్ లియోన్ కౌంటీ అధికారులు నిర్ధారించారు.
Air Ambulance
Plane Crash
Nevada
USA

More Telugu News