2017లో మహిళకు ఆపరేషన్.. అయిదేళ్లుగా కడుపులోనే కత్తెర!

2017లో మహిళకు ఆపరేషన్.. అయిదేళ్లుగా కడుపులోనే కత్తెర!

Doctor leaves scissors in Telangana womans stomach after surgery
  • పెద్దపల్లి జిల్లాలో షాకింగ్ ఘటన
  • 2017లో మహిళకు ఆపరేషన్, కడుపులో కత్తెర మర్చిపోయిన వైద్యులు
  • అయిదేళ్లుగా కడుపునొప్పితో బాధితురాలు సతమతం
వైద్యుల నిర్లక్ష్యంతో పేషెంట్లు ఇక్కట్ల పాలవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. అయిదేళ్ల క్రితం జరిగిన ఆపరేషన్ ఫలితంగా ఓ మహిళ అనూహ్య ఇబ్బందిని ఎదుర్కొన్న ఘటన తాజాగా పెద్దపల్లిలో వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం 2017లో గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కత్తెరను మాత్రం బాధితురాలి కడుపులోనే మర్చిపోయాడు. ఆ తరువాత నుంచి ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. 

ఆపరేషన్ జరిగి అయిదేళ్లవుతున్న నొప్పి వెంటాడుతుండటంతో బాధితురాలు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరింది. ఈ సందర్భంగా వైద్యులు ఆమెకు స్కానింగ్ నిర్వహించగా పొట్టలో కత్తెర ఉన్న విషయం బయటపడింది. దీంతో.. వైద్యులే నిర్ఘాంతపోయారు. మరోవైపు గతంలో మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడిని నిలదీయగా ఆపరేషన్ ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ కాళ్లబేరానికి దిగాడట. కాగా.. మహిళ కడుపులోని కత్తెరకు సంబంధించిన ఎక్స్‌రే చిత్రం ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
Telangana

More Telugu News