Earthquake: జపాన్ లో 6.1 తీవ్రతతో భూకంపం

  • జపాన్ లోని హోక్కైడో ద్వీపంలో భూకంపం
  • 61 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
  • సునామీ ముప్పు లేదన్న అధికార వర్గాలు
Earthquake hits Japan

జపాన్ లోని హోక్కైడో ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో సైరన్లు మోగడంతో హోక్కైడో ద్వీపవాసులు అప్రమత్తమయ్యారు. 

నెమురో ప్రాంతంలో 61 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (ఎన్ఐఈడీ) వెల్లడించింది. ఆస్తినష్టం, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, భారీ భూకంపం వచ్చినా, సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. 

ఫసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న జపాన్ కు భూకంపాల ముప్పు ఎక్కువ. ఇక్కడి ఇళ్లను కూడా భూకంపాలను తట్టుకునే విధంగా కలప, తేలికపాటి పదార్థాలతో నిర్మిస్తుంటారు. భూకంపాలను గుర్తించేందుకు జపాన్ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది.

More Telugu News