Intintiki Telugudesam: రేపటి నుంచి తెలంగాణలో 'ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ' కార్యక్రమం

Intintiki Telugudesam in Telangana starts from tomorrow
  • ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో కార్యక్రమం
  • ప్రారంభించనున్న చంద్రబాబు
  • తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు
  • టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ

తెలంగాణలో రేపటి నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. రేపు (ఫిబ్రవరి 26) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఇంటింటీకీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారని జ్ఞానేశ్వర్ చెప్పారు. 

10 రోజుల తర్వాత అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని వివరిస్తామని వెల్లడించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ జరుపుతామని కాసాని జ్ఞానేశ్వర్ వివరించారు. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారని తెలిపారు.

  • Loading...

More Telugu News