ఎస్బీఐ యోనో యూజర్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ మెసేజ్లకు అస్సలు స్పందించొద్దు
- యోనో అకౌంట్ బ్లాక్ అవుతుందని సైబర్ నేరగాళ్ల సందేశాలు
- పాన్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలంటూ లింక్స్ పంపిస్తున్న వైనం
- ఆ లింక్స్ ను తెరవొద్దంటున్న ఎస్బీఐ
ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే [email protected] లో రిపోర్ట్ చేయాలని పీఐబీ ప్రజలకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాతా నెంబర్, పాస్వర్డులు, ఓటీపీ సహా ఇతర సున్నిత, వ్యక్తిగత సమాచారాన్ని మెసేజ్ ల రూపంలో పంపొద్దని ఎస్బీఐ చెబుతోంది. సైబర్ నేరగాళ్లు తమ లింక్స్ ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసం చేస్తారని తెలిపింది. ఏదైనా సైబర్ నేరం గురించి నేరుగా ఫిర్యాదు చేయాలంటే 1930 నెంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చని తెలిపింది.