చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా అనుభవించాడు: కొడాలి నాని
- జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ పగ్గాలు ఇస్తే కనీసం ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న కొడాలి నాని
- నారా లోకేశ్ కు విశ్వసనీయత లేదని విమర్శ
- తారక్ ను వాడుకుని వదిలేశారని మండిపాటు
నారా లోకేశ్ విశ్వసనీయత లేని వ్యక్తి అని... అందుకే మంగళగిరిలో బ్రహ్మణి ప్రచారం చేసినా లోకేశ్ ఓడిపోయారని కొడాలి నాని అన్నారు. అక్కడ బ్రహ్మణి పోటీ చేసి ఉంటే గెలిచేవారని చెప్పారు. మంగళగిరిలోనే పార్టీని గెలిపించలేని వాళ్లు... రాష్ట్రంలో ఆ పార్టీని ఎలా నడిపించగలరని ప్రశ్నించారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని, ఆ తర్వాత అవమానించారని... చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా అనుభవించాడని చెప్పారు.