Florida: ఫ్లోరిడాలో స్టూడెంట్ కొట్టిన కొట్టుడికి కోమాలోకి వెళ్లిన టీచర్.. వీడియో

Florida student beats teacher unconscious for taking away video game vedio
  • వీడియో గేమ్ స్వాధీనం చేసుకున్న అసిస్టెంట్ టీచర్
  • పట్టరాని కోపంతో నియంత్రణ కోల్పోయిన విద్యార్థి
  • బలంగా తోసేసి పిడిగుద్దులు కురిపిస్తూ దాడి
ఆచార్య దేవోభవ అంటూ గురువులను గౌరవించడం మన సంప్రదాయం. కానీ, ఫ్లోరిడాలో ఓ విద్యార్థి మాత్రం అసిస్టెంట్ టీచర్ (టీచర్స్ ఎయిడ్)ను శత్రువులా చూశాడు. తన వీడియో గేమ్ తీసేసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో రెచ్చిపోయి దాడి చేశాడు. ఫ్లోరిడాలోని మటాంజస్ హైస్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లాగ్లర్ కౌటీ షెరిఫ్ కార్యాలయం ఈ దాడికి సంబంధించి వీడియో ఫుటేజీని విడుదల చేసింది. 

స్కూల్లో వీడియో గేమ్ ఆడుతుండడంతో అసిస్టెంట్ టీచర్ దాన్ని స్వాధీనం చేసుకుని ముందుకు వెళుతున్నారు. దీంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన 17 ఏళ్ల విద్యార్థి, టీచర్ ను గట్టిగా తోసేయడంతో ఆమె ఎగిరి అంత దూరంలో కిందపడిపోయింది. తల నేలను గట్టిగా తాకడంతో స్పృహ కోల్పోయింది. అయినా కానీ విద్యార్థి ఆగలేదు. ఆమె వీపు భాగంలో పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేస్తూనే ఉన్నాడు. దీంతో అక్కడ ఉన్న వారు అతడ్ని ఏదో విధంగా కొంత సమయానికి నిలువరించారు. 

‘‘ఇది హత్య లాంటిదే. ఎవరినైనా అలా కిందకు తోసినప్పుడు, వారి తల నేలను తాకినప్పుడు ఫలితాన్ని ఊహించలేం’’ అని సెరిఫ్ రిక్ స్టాలీ ప్రకటించారు. అసిస్టెంట్ టీచర్ ను హాస్పిటల్ లో చేర్పించగా, పక్కటెముకలు విరిగినట్టు గుర్తించి వైద్యం అందించారు. 

Florida
student
beats
teacher
unconscious
video

More Telugu News