BJP: ఇది లవ్ జిహాదీ కేసేనంటూ.. ప్రీతి ఘటనపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

This is a love jihadi case  Bandi Sanjays sensational allegations on Preeti incident
  • కేసును చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్న సంజయ్ 
  • ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్
  •  హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని ఆరోపణ   
వరంగల్ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది ముమ్మాటికీ ‘లవ్ జిహాదీ’ కేసేనని అన్నారు. కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఘటనపై మాట్లాడిన సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఇది ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు అని, ఓ వర్గానికి చెందిన వాళ్లు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. వారికి ఇతర దేశాల నుండి డబ్బులు వస్తున్నాయన్నారు. వాటితో అమ్మాయిలను టార్గెట్ చేసి లవ్ జిహాదీ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు.

ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని సంజయ్ డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనను చల్లబర్చడానికి మెరుగైన వైద్యం పేరుతో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రీతిని అనేక సార్లు వేధింపులకు గురిచేశారని ఆమె తండ్రి చెప్పినా.. దీన్ని చిన్న కేసుగా మార్చి నీరుగార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
BJP
Bandi Sanjay
Preeti incident
love jihadi case
Warangal

More Telugu News