Telangana: డీజిల్ ట్యాంకర్ బోల్తా! ఇదే అదనుగా రెచ్చిపోయిన స్థానికులు

Locals rush to steal diesel as tanker turns turtle
  • కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • బకెట్లతో డీజిల్ ఎత్తుకుపోయిన స్థానికులు
  • డ్రైవర్ వారిస్తున్నా వినని వైనం
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు ఇదే అదనుగా భావించి బకెట్లతో డీజిల్‌ను ఎత్తుకెళ్లిపోయారు. కొత్తగూడెం జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. మలుపు తిరిగే సమయంలో ట్యాంకర్ అదుపు తప్పి ఓ పక్కకు ఒరిగిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ వారిస్తున్నా వినకుండా బకెట్లతో ట్యాంకర్‌లోని డీజిల్‌ను ఎత్తుకెళ్లిపోయారు. తాము తస్కరించింది చాలక.. తెలిసి వాళ్లకూ సమాచారం ఇచ్చి డీజిల్ తీసుకెళ్లమని ప్రోత్సహించారు. దొరికినకాడికి డీజిల్ దోచుకుపోయారు. దీంతో.. బిత్తరపోవడం డ్రైవర్ వంతైంది. ప్రమాదం జరిగినప్పుడు సాయపడాల్సింది పోగా ఇలా దోచుకుపోవడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Telangana

More Telugu News