Tadi Shakuntala: బీఆర్ఎస్‌కు బూస్ట్.. పార్టీలో చేరిన విజయవాడ మాజీ మేయర్ శకుంతల

Vijayawada ex mayor tadi shakuntala joins in BRS
  • 2005-06లో ఏడాదిపాటు విజయవాడ మేయర్‌గా పనిచేసిన శకుంతల
  • శకుంతలతోపాటు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలు
  • బీఆర్ఎస్‌లో చేరికకు ముందు వైసీపీలో ఉన్న శకుంతల
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సారథ్యంలోని బీఆర్ఎస్‌లోకి ఏపీ నుంచి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా, నిన్న విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల పార్టీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మల్యాద్రి సహా పలువురు మైనారిటీ నేతలు పార్టీలో చేరారు. 

విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల 2005-06లో ఏడాది పాటు నగర మేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీల్లోనూ కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ నాయకురాలిగా మారారు.
Tadi Shakuntala
Vijayawada
BRS
KCR
Thota Chandrasekhar

More Telugu News