Raghuveera Reddy: డింగీలో మనవరాలితో రఘువీరారెడ్డి జలవిహారం.... వీడియో ఇదిగో!

Raghuveera sails with his granddaughter in a coracle
  • రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా రఘువీరా
  • స్వగ్రామానికే పరిమితమైన నేత
  • అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు
  • తాజాగా వీడియో షేర్ చేసిన వైనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఎక్కడా హస్తం పార్టీకి ప్రాతినిధ్యం అన్నదే లేకుండా పోయింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన రఘువీరారెడ్డి వంటి నేత కూడా దాదాపు అజ్ఞాతంలో గడిపేంతగా పరిస్థితులు మారిపోయాయి. 

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా కొన్నాళ్లు పనిచేసిన రఘువీరా ఆ తర్వాత పూర్తిగా స్వగ్రామం నీలకంఠాపురానికి పరిమితయ్యారు. ఈ క్రమంలో ఆయన వందల ఏళ్ల నాటి పురాతన ఆలయాల పునరుద్ధరణకు నడుంబిగించి అనుకున్నది పూర్తి చేశారు. అప్పుడప్పుడు రఘువీరా సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలు పంచుకుంటూ అభిమానులను పలకరిస్తుంటారు. 

తాజాగా, తన మనవరాలితో కలిసి ఓ ఫైబర్ డింగీలో జలవిహారం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. తమ స్వగ్రామం నీలకంఠాపురం వద్ద ఓ జలాశయంలో మనవరాలితో కలిసి సరదాగా గడిపినట్టు రఘువీరా ట్వీట్ చేశారు.
Raghuveera Reddy
Granddaughter
Coracle
Neelakanthapuram

More Telugu News