Mruthyunjaya Homam: అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో నిలిచిపోయిన మృత్యుంజయ హోమం

  • ఎస్కే వర్సిటీలో వరుస మరణాలు!
  • మృత్యుంజయ హోమం తలపెట్టిన అధికారులు
  • ఆందోళనలు చేపట్టిన విద్యార్థి సంఘాలు
  • వెనక్కి తగ్గిన వర్సిటీ పాలకవర్గం
Mruthunjaya Homam stopped in SK University after huge protests by student unions

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో తలపెట్టిన మృత్యుంజయ హోమం నిలిచిపోయింది. వర్సిటీ సిబ్బంది వరుసగా చనిపోతుండడంతో ఆందోళన చెందిన అధికారులు మృత్యుంజయ హోమం నిర్వహించాలని నిర్ణయించారు. 

అయితే, విద్యార్థి సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. గత కొన్నిరోజులుగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, వర్సిటీ పాలకవర్గం వెనక్కి తగ్గింది. మృత్యుంజయ హోమాన్ని నిలిపివేస్తూ ఎస్కే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సర్క్యులర్ జారీ చేశారు. 

కాగా, ఈ హోమానికి డబ్బులు వసూలు చేయడం కూడా విమర్శలకు దారితీసింది. టీచింగ్ స్టాఫ్ నుంచి రూ.500, నాన్-టీచింగ్ స్టాఫ్ నుంచి రూ.100 వసూలు చేయాలని నిర్ణయించారు.

More Telugu News