Dhanush: 'సార్' సినిమాలోని ఆ సీన్, త్రివిక్రమ్ లైఫ్ లోని సంఘటనే: వెంకీ అట్లూరి

  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'సార్'
  • తెలుగు .. తమిళ భాషల్లో భారీ వసూళ్లు 
  • నిర్మాతగా త్రివిక్రమ్ సజషన్స్ గురించిన ప్రస్తావన
  • అది ఆయన జీవితంలో నుంచి మాట అని వెల్లడి
Venky Atluri Interview

ధనుశ్ హీరోగా రూపొందిన 'సార్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, 3 రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. తెలుగులోనే కాకుండా తమిళంలోను ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది. దగ్గరలో పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడంతో, లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించనుంది. 

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. "ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు ఒక నిర్మాత అనే విషయం తెలిసిందే. ఒక నిర్మాతగానే కాకుండా ఆయన రచయితగాను కొన్ని సజషన్స్ ఇచ్చారు. నేను రాసుకున్న కథలో ధనుశ్ తండ్రి పాత్ర చాలా చిన్నది. కానీ త్రివిక్రమ్ గారు ఆ పాత్ర నిడివిని పెంచమని చెప్పారు" అన్నాడు. 

" హీరో తండ్రి పాత్ర అతనితో .. "అడిగింది కొనివ్వకపోతే పిల్లలు ఆ ఒక్క రోజే ఏడుస్తారు .. కానీ తమ పరిస్థితి మారేవరకూ ఆ తల్లిదండ్రులు ఏడుస్తారు" అని అంటాడు. నిజానికి అది త్రివిక్రమ్ లైఫ్ లో జరిగిన సంఘటనే. ఆయనను ఇంజనీరింగ్ చదివించలేని ఆయన తండ్రి నిస్సహాయతలోనిది ఆ మాట" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News