GMA TV show: జీఎంఏ టీవీ షోలో చరణ్ పాల్గొనడంపై చిరంజీవి భావోద్వేగ ట్వీట్

Chiranjeevi emotional tweet on Charan participation in the GMA TV show
  • గుడ్ మార్నింగ్ అమెరికా షో నుంచి చరణ్ కు ఆహ్వానం
  • ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా నిలిచిన రామ్ చరణ్
  • ఆస్కార్ కు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట
దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మేనియా ఇప్పట్లో ఆగేలా లేదు. భారీ కలెక్షన్స్, ప్రశంసలు, ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు రేసులో నిలిచింది. ఈ  చిత్రంలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది. వచ్చే నెల 12న ఆస్కార్ అవార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ తేజ్ అమెరికా వెళ్లారు. జీఎంఏ (గుడ్ మార్నింగ్ అమెరికా) టెలివిజన్ షోలో పాల్గొన్నారు. 

ఈ షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు. దీనిపై ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఈ షోలో పాల్గొన్న ఫొటోలు, ఎపిసోడ్ లింక్ ను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘రామ్ చరణ్ ప్రఖ్యాత గుడ్ మార్నింగ్ అమెరికాలో పాల్గొన్నాడు. ఇది తెలుగు, భారతీయ సినిమాకి గర్వకారణం. దార్శనికుడైన రాజమౌళి మెదడులో పుట్టిన ఒక ఉద్వేగ భరితమైన ఆలోచనా శక్తి ప్రపంచాన్ని ఎలా ఆవరించిందో చూస్తే ఆశ్చర్యంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
GMA TV show
USA
Ramcharan
Chiranjeevi
RRR
Rajamouli

More Telugu News