conman: జైలులో సుకేశ్ చంద్రశేఖర్ కంటతడి.. వీడియో ఇదిగో !

Conman Breaks Down During Raid In Cell
  • సెల్ లో ఆకస్మిక తనిఖీలు జరిపిన జైలర్
  • సుకేశ్ గదిలో బయటపడ్డ ఖరీదైన చెప్పులు, జీన్స్
  • తనిఖీ చేస్తున్నంతసేపూ గదిలో ఓ మూలన నిలబడ్డ సుకేశ్
  • అధికారుల ముందు ఏడ్చేసిన వైనం
మనీలాండరింగ్ కేసులో కటకటాలపాలైన సుకేశ్ చంద్రశేఖర్ జైలులో కూడా విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సుకేశ్ మండోలి జైలులో ఉన్నాడు. బుధవారం రాత్రి అతని గదిని ఆకస్మిక తనిఖీ చేసిన జైలర్.. రూమ్ లో ఉన్న వస్తువులను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. సీఆర్ పీఎఫ్ సిబ్బంది సాయంతో జరిగిన ఈ సోదాల్లో సుకేశ్ ఉపయోగిస్తున్న పలు ఖరీదైన వస్తువులు బయటపడ్డాయి.

వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్న జైలర్.. గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సోదాలు జరుగుతుండగా సుకేశ్ ను గదిలోనే ఓ పక్కకు నిలబెట్టగా.. ఒక్కసారిగా సుకేశ్ బరస్ట్ అయ్యాడని, కంటతడి పెట్టాడని వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

సుకేశ్ గదిలో ఉపయోగిస్తున్న రూ.1.5 లక్షల విలువైన గూచి శాండిల్స్, రూ.80 వేల విలువ చేసే రెండు జీన్స్ బయటపడ్డాయని జైలర్ వివరించారు. కాగా, రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలను కూడా అధికారులు విచారించారు.
conman
sukesh
Jacqueline Fernandez
Gucci Sandals
Raid in cell

More Telugu News