మా పిల్లలను ఇలాగే పెంచుతాం: ఉపాసన

సినీ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. తరగని సిరిసంపదలు ఆమె సొంతం. అయితే జనాలు తనను అదే కోణంలో నుంచి మాత్రమే చూస్తున్నారని ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. తాను డైమండ్ స్పూన్ తో పుట్టడం వెనుక తన తల్లిదండ్రుల కష్టం ఎంతో ఉందని చెప్పారు. ఆ కష్టం విలువ తనకు తెలుసని అన్నారు. అందుకే తమకు పుట్టబోయే పిల్లలకు కష్టం విలువ తెలిసేలా తాను, రాంచరణ్ పెంచుతామని చెప్పారు. 

తాను ఇంటి వద్ద ఖాళీగా కూర్చోనని... తన పుట్టుకకు కూడా ఒక కారణం ఉందని తాను నమ్ముతానని అన్నారు. గొప్ప కుటుంబంలో పుట్టి ఉండి కూడా చుట్టూ ఉన్న ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించకపోతే తన జీవితానికి అర్థం ఉండదని చెప్పారు, తన గురించి నెగెటివ్ వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. మరోవైపు ఉపాసన గర్భవతి అనే విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.


More Telugu News