Nara Lokesh: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్ర

Nara lokesh yuvagalam enteres srikakulam constituency
  • 24వ రోజుకు చేరిన యువగళం కార్యక్రమం
  • లోకేశ్ వెంట భారీగా తెలుగుదేశం శ్రేణులు
  • యువనేతతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజల ఆసక్తి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జనవరి 27న కుప్పం పట్టణం నుంచి నారా లోకేశ్ పాదయాత్ర మొదలు కావడం తెలిసిందే. నేడు ఈ యాత్ర 24వ రోజుకు చేరుకుంది. 

బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొంటున్నాయి. ముఖ్యంగా యువనేతతో సెల్ఫీలు తీసుకునేందుకు యువకుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఆసక్తి చూపించడాన్ని గమనించొచ్చు. మొత్తం 400 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు. 

పాదయాత్రలో భాగంగా పలువురు తమ బాధలు, కష్టాలను నారా లోకేశ్ తో పంచుకుంటున్నారు. కొందరు తమ సమస్యలను తెలియజేస్తూ యువనేతకు వినతి పత్రాలు ఇస్తున్నారు. దారిన పోయే వాహనదారులను సైతం లోకేశ్ పలకరించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. 
Nara Lokesh
TDP
yuvagalam
pada yatra
srikakulam
constituency

More Telugu News