Rahul Gandhi: వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు.. కానీ పిల్లలు కావాలని ఉంది: రాహుల్ గాంధీ

Too many things to do but I would like to have children says Rahul Gandhi

  • ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • తన అమ్మమ్మకు ప్రియాంక అంటే ఎంతో ఇష్టమన్న రాహుల్
  • గడ్డం తీయడంపై ఇంకా నిర్ణయించుకోలేదన్న రాహుల్

ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదన్న ఆయన.. పిల్లలు కావాలని మాత్రం ఉందని బదులిచ్చారు. తన అమ్మమ్మ పావ్‌లామాయినోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ఎంతో ఇష్టమని, ప్రాణప్రదంగా చూసుకుందని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. ఎందుకన్న విషయం తెలియదని, కాకపోతే ఈ విషయం తనకే విచిత్రంగా ఉంటుందని అన్నారు. చాలా పనులు చేయాల్సి ఉందన్న ఆయన తనకు పిల్లలు కావాలని ఉందని మనసులో మాటను బయటపెట్టారు.

భారత్ జోడో యాత్ర సందర్భంగా గడ్డంతో కనిపించడంపైనా రాహుల్ స్పందించారు. యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, ఇప్పుడా గడ్డాన్ని ఉంచాలా? తీసేయాలా? అన్న విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు.

More Telugu News