Wipro: విమర్శల పాలవుతున్న విప్రో 'సగం జీతం' ఆఫర్

  • ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న విప్రో
  • రూ.6.5 లక్షలతో వార్షిక ప్యాకేజి
  • ఇప్పుడు అందులో సగమే ఇస్తామంటున్న విప్రో
  • మండిపడుతున్న ఐటీ ఉద్యోగుల సంఘం
Wipro half salory decision being criticized

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఇటీవల తీసుకువచ్చిన హాఫ్ శాలరీ (సగం జీతం) ఆఫర్ విమర్శల పాలవుతోంది. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థలు కొన్ని ఉద్యోగాలకు అనుభవంతో పనిలేకుండా ఫ్రెషర్లను తీసుకోవడం సర్వసాధారణం.

విప్రో కూడా ఓ నోటిఫికేషన్ ద్వారా ఫ్రెషర్లను ఉద్యోగంలోకి తీసుకుంది. వారికి వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ సెక్షన్ లో శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు విప్రో సంవత్సరానికి రూ.6.5 లక్షల ప్యాకేజీ ఇస్తామని తొలుత పేర్కొంది. 

అయితే ఇప్పుడు అందులో సగమే ఇస్తామని విప్రో అంటోంది. అంతేకాదు, సగం జీతానికే విధుల్లో చేరాలంటూ ఫ్రెషర్లకు ఈ-మెయిల్ సందేశాలు పంపింది. దీనిపై ఐటీ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది.

ఇంతటి అన్యాయమైన నిర్ణయం ఏ విధంగా సమంజసమో విప్రో సమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ఇది ఎవరికీ సమ్మతం కాదని పేర్కొంది. వేతనాన్ని సగం తగ్గించుకోమని కోరడం అనైతికం అని ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్పీత్ సింగ్ సలౌజా విమర్శించారు. కంపెనీ ఆర్థిక సమస్యలను ఉద్యోగులపై మోపుతారా? అని ప్రశ్నించారు.

More Telugu News