Medical College: విజయనగరంలో మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి

  • ఏపీకి కొత్త వైద్య కళాశాల
  • 150 సీట్లతో విజయనగరం మెడికల్ కాలేజి
  • 2023-24 నుంచి బోధన
  • త్వరలో మరో 4 వైద్య కళాశాలలు
Center gives nod to medical college in Vijayanagaram

ఏపీకి మరో వైద్య కళాశాల మంజూరైంది. విజయనగరంలో మెడికల్ కాలేజీకి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. 150 సీట్లతో ఈ వైద్య కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసీ సమ్మతించింది. విజయనగరం వైద్య కళాశాలలో 2023-24 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని ఎన్ఎంసీ వెల్లడించింది. 

త్వరలోనే మరో 4 వైద్య కళాశాలలకు అనుమతి వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ ఏడాదే నాలుగు కళాశాలలు ప్రారంభమయ్యేలా చర్యలు ఉంటాయని వివరించింది.

More Telugu News