Geetanand: ఆసక్తిని రేపుతున్న 'గేమ్ ఆన్' టీజర్!

  • ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వస్తున్న 'గేమ్ ఆన్'
  • హీరోగా గీతానంద్ పరిచయం
  • కీలకమైన పాత్రలో ఆదిత్య మీనన్ 
  • ప్రత్యేకమైన పాత్రలో మధుబాల 
Game On Movie Teaser released

టాలీవుడ్ కి గీతానంద్ అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. ఆయన హీరోగా రూపొందిన 'గేమ్ ఆన్' విడుదలకు రెడీ అవుతోంది. కస్తూరి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, దయానంద్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 

ఈ కథ అంతా కూడా సైకలాజికల్ గేమ్ చుట్టూ తిరుగుతుందనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. యాక్షన్ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. అశ్విన్ - అర్జున్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, అభిషేక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్చాడు. 

ఇంతకుముందు కార్తికేయ జోడిగా '90ML' చేసిన నేహా సోలంకి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఆదిత్య మీనన్ .. మధుబాల కీలకమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News