Hyundai Verna: కొత్త లుక్ తో అదరగొడుతున్న హ్యుండాయ్ వెర్నా

  • వెర్నాకు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ తీసుకువచ్చిన హ్యుండాయ్
  • భారత్ లో బుకింగ్స్ ప్రారంభం
  • పూర్తిగా స్పోర్టీ లుక్ తో వెర్నా-2023
  • 4 ట్రిమ్ ఆప్షన్స్ తో లభ్యం
  • ఇంకా వెల్లడికాని స్పెసిఫికేషన్స్
Here it is all new Hyundai Verna

దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్ తన వెర్నా కారును సరికొత్తగా ముస్తాబు చేసి భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. హ్యుండాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ సరికొత్తగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పూర్తిగా స్పోర్టీ లుక్ తో ఉన్న వెర్నా-2023 మోడల్ కు భారత్ లో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. 

ఇప్పటిదాకా ఇలాంటి స్లీక్ డిజైన్ కార్లు భారత్ లో తక్కువేనని చెప్పాలి. మరి, హ్యుండాయ్ వెర్నా కొత్త వెర్షన్ ఏ మేరకు అమ్మకాలు సాగిస్తుందో చూడాలి. ఇది 4 ట్రిమ్ ఆప్షన్స్ లో లభిస్తోంది. అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ ఫీచర్లకు, కంఫర్ట్ కు ఈ మోడల్ లో పెద్దపీట వేసినట్టు హ్యుండాయ్ చెబుతోంది. 

ఇది 1.5 లీటర్ ఎంపీఐ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో వస్తోంది. 1.5 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ రకాలు అందుబాటులో ఉన్నాయి. 

1.5 లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్ మిషన్ (ఐవీటీ) అందుబాటులో ఉన్నాయి. 

దీని లుక్ విషయానికొస్తే... పాత వెర్నా మోడల్ తో పోల్చితే ఫ్రంట్ గ్రిల్ ను పూర్తిగా మార్చేశారు. పొడవైన డీఆర్ఎల్ బార్, గ్రిల్ కు చివరన అందంగా ఒదిగిపోయిన రీవర్క్ డ్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, పూర్తిగా రీడిజైన్ చేసిన బంపర్, ఎయిర్ ఇన్ టేక్ చాంబర్ తో ఏరోడైనమిక్స్ అదిరిపోయాయి.

లేటెస్ట్ మోడల్ వెర్నాకు సంబంధించి హ్యుండాయ్ కొద్ది సమాచారం మాత్రమే విడుదల చేసింది. దీని పూర్తి స్పెసిఫికేషన్స్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.
.

More Telugu News