panipuri: థమ్స్ అప్ పానీ పూరీ.. ఇది స్పెషల్ చాట్!

Video of man making Thums Up panipuri gets thumbs down from netizens
  • ఈ పానీ పూరీలో చింతపండు చారు ఉండదు
  • కారం, మసాలా రంగరించిన థమ్స్ అప్ ద్రావకంలో ముంచి తినడమే
  • థమ్స్ అప్, పానీ పూరీ ప్రియులకు నచ్చే కాంబినేషన్ ఫుడ్
వీధుల్లో కనిపించే చాట్ బాండార్ వద్ద పానీ పూరీ తినడం చాలా మందికి ఇష్టం. చాలా మందికి దీని రుచి నచ్చుతుంది. తోపుడు బండ్లపై చాట్స్, పానీ పూరీలు పరిశుభ్రంగా ఉండవని, ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్యరంగ నిపుణులు తరచూ చెబుతున్నా, వినిపించుకునే వారు ఎవరూ ఉండరు. చాట్, పానీ పూరీని ఇష్టపడేవారు తినకుండా ఉండలేరు. 

పానీ పూరీలో చాట్ పెట్టి, చింత పండుతో చేసిన ద్రావకంలో ముంచి ఇస్తే లొట్టలేసుకుంటూ తినేవారి కోసం.. ఒక కొత్త పానీ పూరీ వచ్చింది. ఇక్కడ చింత పండు చారుకు బదులు థమ్స్ అప్ కూల్ డ్రింక్ లో పానీ పూరీ ముంచి ఇస్తారు. అదే తేడా. దీని రుచి ఎలా ఉంటుంది? అని అడగొద్దు. తినేవారి వీడియో చూసి తెలుసుకోవాల్సిందే. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరింది. ఇందులో థమ్స్ అప్ పానీ పూరీ తింటూ ఓ మహిళ సూపర్ అని చెప్పడాన్ని గమనించొచ్చు. 

‘‘పానీ పూరీ లవర్స్ ఇక్కడ థమ్స్ అప్ పానీ పూరీ అందిస్తున్నాం. థంమ్స్ డౌన్ తో మీ ప్రేమను తెలియజేయండి’’ అంటూ మహమ్మద్ ఫుతుర్వాలా అనే వ్యక్తి ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు. చాట్ స్టాల్ యజమాని థమ్స్ అప్ ను ఓ గిన్నెలో పోసి అందులో మసాలా, కారం వేసి కలపడాన్ని గమనించొచ్చు.  
panipuri
made with
Thums Up
cool drink

More Telugu News