MLCs: 18 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వీరే

  • స్థానిక, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
  • బీసీలకు 11 స్థానాలతో పెద్ద పీట వేసిన జగన్
  • ఎస్సీలకు 2.. ఎస్టీలకు 1 స్థానం
YSRCP MLC list

ఏపీలో స్థానిక, ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లను ప్రకటించారు. మొత్తం స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్ధానాన్ని కేటాయించారు. 

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా:

స్థానిక సంస్థల కోటా:

  • ఎస్. మంగమ్మ - అనంతపురం. బీసీ. బోయ
  • డాక్టర్ మధుసూదన్ - కర్నూలు. బీసీ. బోయ
  • రామసుబ్బారెడ్డి - కడప. ఓసీ. రెడ్డి
  • డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం - చిత్తూరు. బీసీ. వెన్నెరెడ్డి
  • మేరుగ మురళీధర్ - నెల్లూరు. ఎస్సీ. మాల
  • కావూరు శ్రీనివాస్ - పశ్చిమగోదావరి. బీసీ. శెట్టిబలిజ
  • వంకా రవీంద్రనాథ్ - పశ్చిమగోదావరి. ఓసీ. కాపు
  • కుడిపూడి సూర్యనారాయణ - తూర్పుగోదావరి. బీసీ. శెట్టిబలిజ
  • సత్తు రామారావు - శ్రీకాకుళం. బీసీ. యాదవ

ఎమ్మెల్యే కోటా:
  • ఏసురత్నం - గుంటూరు. బీసీ. వడ్డెర
  • మర్రి రాజశేఖర్ - గుంటూరు. ఓసీ. కమ్మ
  • జయమంగళ వెంకటరమణ - పశ్చిమగోదావరి. బీసీ. వడ్డెర
  • బొమ్మి ఇజ్రాయిల్ - తూర్పుగోదావరి. ఎస్సీ. మాదిగ
  • కోలా గురువులు - విశాఖ. బీసీ. వడబలిజ
  • పోతుల సునీత - ప్రకాశం. బీసీ. పద్మశాలి
  • పెన్మత్స సూర్యనారాయణ రాజు - విజయనగరం. ఓసీ. క్షత్రియ. 

గవర్నర్ కోటా:
  • కర్రి పద్మశ్రీ - కాకినాడ. బీసీ. మత్స్యకార
  • కుంభా రవి - అల్లూరి జిల్లా. ఎస్టీ. ఎరుకుల

More Telugu News