Saudi Arabia: సౌదీ అరేబియా భారీ కట్టడం.. అదరగొడుతున్న డిజైన్ వీడియో!

Saudi Arabia Announces Next Mega Project Video Goes Viral
  • ముకాబ్ పేరుతో అతి భారీ కట్టడానికి డిజైన్ చేసిన సౌదీ అరేబియా
  • దాదాపు 400 మీటర్ల ఎత్తుతో రియాద్ సిటీలో నిర్మాణం
  • 2030 నాటికల్లా పూర్తి చేయాలని టార్గెట్
సౌదీ అరేబియా.. సుసంపన్న దేశం. అకాశాన్నంటే నిర్మాణాలతో, భారీ ప్రాజెక్టులతో అప్పుడప్పుడూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటుంది.. ఈ క్రమంలో తాబేలు ఆకారంలో భారీ ఓడను నిర్మించి.. దాన్ని తేలియాడే నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. దానికి పాంజియోస్ అనే పేరు కూడా పెట్టింది.

తాజాగా మరో అబ్బురపరిచే నిర్మాణానికి సౌదీ ప్లాన్ చేసింది. రాజధాని నగరం రియాద్ లో ‘ముకాబ్’ పేరుతో అతి భారీ కట్టడానికి డిజైన్ చేసింది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ అతి భారీ నిర్మాణం.. మక్కాలోని పవిత్ర ‘కాబా’ మాదిరి.. రియాద్ సిటీలో కనిపిస్తోంది. 

క్యూబ్ ఆకారంలో ఉన్న ఈ అతి భారీ బిల్డింగ్ దాదాపు 400 మీటర్లు ఎత్తు ఉండనుంది. ఇది న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 20 రెట్లు పెద్దది. ఇందులో మ్యూజియం, టెక్నాలజీ అండ్ డిజైన్ యూనివర్సిటీ, మల్టీ పర్పస్ థియేటర్, మరో 80కిపైగా కల్చరల్, ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు వంటివి ఏర్పాటు కానున్నాయి.

‘‘ఈ భారీ నిర్మాణాన్ని 2030 నాటికల్లా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని టూరిజం సంస్థ తెలిపింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Saudi Arabia
Mukaab
Riyadh
Mega Project

More Telugu News