Sandhya Convention: అమితాబ్ బచ్చన్ బంధువులను రూ. 250 కోట్ల మేర మోసం చేసిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్.. హైదరాబాద్ లో అరెస్ట్

Sandhya convention MD Sridhar Rao arrested in Rs 250 Cr cheating case against Amitabh Bachchan reletives
  • సివిల్ వ్యవహారంలో మోసం  చేశారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు
  • తన నివాసంలోనే శ్రీధర్ ను అరెస్ట్ చేసిన వైనం
  • ఇప్పటికే శ్రీధర్ పై పలు కేసులు
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఒక సివిల్ వ్యవహారంలో తమను రూ. 250 కోట్ల మేర మోసం చేశారంటూ శ్రీధర్ పై ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. ఆయన తన నివాసంలో ఉన్నారనే విషయాన్ని గుర్తించిన ఢిల్లీ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఇప్పటికే శ్రీధర్ రావుపై అనేక కేసులు ఉన్నాయి.

Sandhya Convention
Sridhar Rao
Amitabh Bachchan
Bollywood

More Telugu News