: పగటికలలతో ప్రజలను మభ్యపెడుతున్నారు: బొత్స
టీడీపీ అధినేత పగటి కలలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. విజయవాడ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, బీసీలకు వంద సీట్లిస్తానంటున్న బాబు గతంలో ఎన్ని సీట్లిచ్చారో చెప్పాలన్నారు. బలహీన వర్గాల కోసం వేలాది కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించిన ప్రభుత్వం తమదని, ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నప్పటికీ, అభివృద్ధి ఆగలేదని తెలిపారు. వైఎస్సార్ సీపీ కనీసం పేరు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉందన్నారు. జగన్ ను ఉద్దేశించి హంతకుల కంటే ఆర్ధిక నేరాలకు పాల్పడ్డ వారే ప్రమాదకరమన్నారు. ప్రత్యేక రాష్ట్రం భావోద్వేగంతో ఏర్పడి, వ్యాపారం చేస్తున్న పార్టీలో ఒకరిద్దరు ఎంపీలు చేరారని... వివేక్, మందాలనుద్దేశించి అన్నారు.