Chandrababu: తారకరత్న నివాసంలో సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపించిన విజయసాయి, చంద్రబాబు

Vijayasai Reddy and Chandrababu seen closely interacted with each other at Tarakaratna residence
  • నటుడు తారకరత్న కన్నుమూత
  • నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు
  • తారకరత్న నివాసానికి వచ్చిన విజయసాయి, చంద్రబాబు
  • ఒకే సోఫాలో రాజకీయ ప్రత్యర్థులు

సినీ నటుడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తారకరత్న బంధువులైన విజయసాయిరెడ్డి, చంద్రబాబునాయుడు కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తారకరత్న నివాసంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఒకే సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. 

రాజకీయంగా బద్ధ విరోధుల్లాంటి వీరిద్దరూ.... తారకరత్న ఇంట సన్నిహితంగా మాట్లాడుకోవడం దర్శనమిచ్చింది. తారకరత్న మరణానికి దారితీసిన ఆరోగ్య పరిస్థితులను, చికిత్స తీరుతెన్నులను, అంత్యక్రియల వివరాలను చంద్రబాబుకు విజయసాయిరెడ్డి వివరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అవుతోంది. 

తారకరత్న చంద్రబాబు బావమరిది మోహనకృష్ణ కుమారుడు కాగా... తారకరత్న భార్య అలేఖ్య విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలి కుమార్తె.

  • Loading...

More Telugu News