bandla ganesh: జోగి నాయుడికి పదవిపై.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్!

bandla ganesh tweet on jogi naidu appointment as ap culture and creative head
  • జగన్ ను నమ్ముకున్నందుకు జోగి నాయుడుకీ పదవి ఇచ్చారన్న బండ్ల గణేశ్
  • ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ ట్వీట్
  • సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు
టాలీవుడ్ కమెడియన్ జోగి నాయుడికి ఏపీ ప్రభుత్వంలో పదవి దక్కిన విషయం తెలిసిందే. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్’ క్రియేటివ్ హెడ్‌గా ఆయన నియమితులయ్యారు. జోగినాయుడికి 'పి' కేటగిరీలో వేతన చెల్లింపులు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసినందుకు ఈయనకు ఇప్పుడు పదవి వరించింది. 

ఈ విషయంపై కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. ‘‘జగన్ గారిని నమ్ముకున్నందుకు జోగి నాయుడుకి కూడా పదవి. ఆల్ ది బెస్ట్ తమ్ముడు’’ అంటూ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే బండ్ల గణేశ్ ను ఏకిపారేస్తున్నారు. ‘త్రివిక్రమ్ వీడిని ఎందుకు రానివ్వలేదో ఇప్పుడు అర్థం అయింది’ అని ఒకరు.. ‘కళ్యాణ్ గారు కొందరిని దూరంగా ఉంచడమే మంచింది... ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నారు’ అని మరొకరు కామెంట్ చేశారు.
bandla ganesh
jogi naidu
ap creativity and culture commission creative head
YSRCP
Tollywood
YS Jagan

More Telugu News