Anushka Shetty: రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన అనుష్క.. ఇప్పుడు ఎలా ఉందంటే!

Anushka Shetty celebrates Maha Shivaratri with her family in Bangalore
  • బెంగళూరులో శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న అనుష్క
  • నిశ్శబ్ధం తర్వాత బయటకు రాని స్వీటీ
  • ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో సినిమా చేస్తున్న అనుష్క
టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ఆచితూచి సినిమాలు చేస్తుంటుంది. నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు, కథ, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న వాటినే ఎంచుకుంటుంది. ఈ తరం హీరోయిన్లకు పూర్తి భిన్నంగా కనిపిస్తుందామె. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఆమె.. బయట కూడా ఎక్కువగా కనిపించదు. అయితే, శివరాత్రి సందర్భంగా తాజాగా బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె బయట కనిపించడంతో అభిమానులందరూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వైట్ డ్రెస్ లో సింపుల్ గా ఉన్న అనుష్క కాస్త బొద్దుగా కనిపించింది. అనుష్క చివరగా ‘నిశ్శబ్ధం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం 2020లో విడుదలవగా.. ఆమె ప్రమోషన్స్ లో పాల్గొన్నది. అనంతరం ఏ వేదికపైనా అనుష్క కనిపించలేదు. కాగా, అనుష్క ప్రస్తుతం యువ హీరో నవీన్‌ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. దీనికి ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ ఖరారు చేశారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Anushka Shetty
Maha Shivaratri
Bangalore
look

More Telugu News