Bandi Sanjay: కవిత రూ. 100 కోట్లు తీసుకెళ్లింది: బండి సంజయ్

Kavitha took Rs 100 cr in liquor scam says Bandi Sanjay
  • దొంగ సారా కేసు చార్జ్ షీట్ లో కవిత పేరు 4 సార్లు ఉందన్న సంజయ్
  • కేసీఆర్ అరాచకాలను శివుడు చూస్తున్నాడని వ్యాఖ్య
  • హిందూ ధర్మాన్ని విమర్శించడం కొందరికి ఫ్యాషన్ గా మారిందని మండిపాటు
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దొంగ సారా దందా (ఢిల్లీ లిక్కర్ స్కామ్) కేసు చార్జ్ షీట్ లో కవిత పేరు 4 సార్లు ఉందని... కేసీఆర్ అరాచకాలను శివుడు చూస్తున్నాడని అందుకే చార్జ్ షీట్ లో ఆయన కుమార్తె పేరు ఉందని అన్నారు. దొంగ సారాలో కేసీఆర్ కూతురు రూ. 100 కోట్లను తీసుకుపోయిందని... ఆమె పేరు చార్జ్ షీట్ లో వచ్చినప్పటికీ, ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

కేసీఆర్... నిన్ను శివుడు, మోదీ చూస్తారని అన్నారు. హిందూ ధర్మాన్ని విమర్శించడం కొందరికి ఫ్యాషన్ గా మారిందని చెప్పారు. రాజకీయాల కోసం తాము హిందూ ధర్మాన్ని ఉపయోగించమని, రజాకార్ల పాలనను రాష్ట్రం నుంచి తరిమికొడతామని అన్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై ఉన్నారని ఈడీ పేర్కొంది. మరోసారి ఈ కేసులో కవిత పేరు రావడం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది.
Bandi Sanjay
BJP
KCR
K Kavitha
BRS
Delhi Liquor Scam

More Telugu News