Pattiseema: శివరాత్రి నాడు విషాదం.. పట్టిసీమ వద్ద గోదావరిలో ముగ్గురి మృతి

Three drowned in Pattiseema Godavari
  • పట్టిసీమ వద్ద శివరాత్రి ఉత్సవాలను చూసేందుకు వచ్చిన ముగ్గురు యువకులు
  • పుణ్యస్నానాలు చేసేందుకు గోదావరిలోకి దిగిన వైనం
  • గోదావరిలో కొట్టుకుపోయిన యువకులు
శివరాత్రి వేడుకల సందర్భంగా ఏలూరు జిల్లా పట్టిసీమలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు నదిలోకి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరు ముగ్గురూ తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందినవారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద శివరాత్రి ఉత్సవాలను చూసేందుకు వీరు వచ్చారు. 

ఈ సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు గోదావరిలోకి దిగిన వీరు... ఆ సమయంలో నది లోతును సరిగా అంచనా వేయలేక, ప్రవాహానికి కొట్టుకుపోయారు. దీనికి సంబంధించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గాలింపులో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Pattiseema
Shivaratri

More Telugu News