YV Rao: ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు మృతి.. జగన్ సంతాపం

Jagan pays condolences to APSRTC Employees Union president YV RAO
  • గుండెపోటుతో కన్నుమూసిన వైవీ రావు
  • కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన జగన్
  • ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల తీవ్ర ఆవేదన 
ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు మృతి చెందారు. గుండెపోటుతో ఆయన కన్నుమూశాడు. గొల్లపూడిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు వైవీ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపాన్ని తెలియజేశారు. వైవీ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.
YV Rao
APSRTC
Jagan
YSRCP

More Telugu News