Kajal Aggarwal: తల్లి అయిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గని కాజల్.. ఎంత డిమాండ్ చేస్తోందంటే!

Kajal Aggarwal increased remuneration
  • పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్
  • బాలయ్య, అజిత్ సినిమాల్లో ఛాన్స్
  • రూ. 3 కోట్లకు రెమ్యునరేషన్ పెంచిన కాజల్

పెళ్లి చేసుకుని, పిల్లల తల్లులైన తర్వాత కూడా హీరోయిన్లుగా కొనసాగడం బాలీవుడ్ లో సాధారణ విషయమే. ప్రేక్షకులు కూడా వీరికి బ్రహ్మరథం పడుతుంటారు. కరీనా కపూర్, అలియా భట్, దీపికా పదుకొణే తదితర హీరోయిన్లు ఈ కోవలోకే వస్తారు. అయితే, దక్షిణాదికి వచ్చేసరికి సీన్ మరోలా ఉంటుంది. పెళ్లి చేసుకున్న హీరోయిన్లకు సౌత్ లో అంత క్రేజ్ ఉండదు. పెళ్లి తర్వాత వారికి హీరోయిన్లుగా ద్వారాలు మూసుకుపోయినట్టే. 

అయితే దక్షిణాదిన కూడా ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతోంది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమంత అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ఒక్కో సినిమాకు రూ. 2 - 3 కోట్ల పారితోషికం తీసుకుంది. చైతూతో విడిపోయిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. బాలీవుడ్ లో సైతం అడుగుపెట్టిన సమంత ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 4 - 5 కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తోందని సమాచారం. 

మరోవైపు, కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుని, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత రెండేళ్లుగా ఆమె సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆమె రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో కాజల్ ను తీసుకున్నారు. ఈ సినిమాకు ఆమె రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. అంతేకాదు తమిళంలో అజిత్ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్టు చెపుతున్నారు. పెళ్లికి ముందు కాజల్ ఒకటిన్నర నుంచి రెండో కోట్ల వరకు తీసుకుంది. పెళ్లి తర్వాత పారితోషికాన్ని ఆమె దాదాపు దబుల్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

  • Loading...

More Telugu News