Prabhas: ప్రభాస్ కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ ఎప్పుడంటే..!

Prabhas and Deepika Padukone Movie Project K Release on 2024 January 12th
  • మరో పోస్టర్ విడుదల చేసిన మూవీ మేకర్స్
  • మహా శివరాత్రి సందర్భంగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
  • వచ్చే ఏడాది 12న సినిమా విడుదలకు ముహుర్తం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం అప్ డేట్ వచ్చేసింది. ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ను నిర్మాత ప్రకటించారు. మహా శివరాత్రి వేళ డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్.. ప్రాజెక్ట్ కె పై మరింత క్యూరియాసిటిని పెంచింది. ఎడారిలో ఓ భారీ చేతిని స్నిపర్స్ జాగ్రత్తగా చూస్తున్నట్లు పోస్టర్ లో కనిపిస్తోంది. ప్రభాస్, దీపికా పదుకొణెతో పాటు అమితాబ్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. 

పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ పోస్టర్ ను విడుదల చేశారు. దీపికా పదుకొణె పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అస్తమిస్తున్న సూర్యుడికి ఎదురుగా దీపిక ఓ రాక్ పై నిలబడింది. అంతకుముందు విడుదల చేసిన పలు పోస్టర్లు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులను అలరించాయి.
Prabhas
project k
dorling
new movie
releace date

More Telugu News