Tecno Mobile: ఫీచర్లు ఎక్కువ.. ధర తక్కువ.. టెక్నో పాప్ 7 ప్రో స్మార్ట్ ఫోన్

  • అమెజాన్ పోర్టల్ పై 22 నుంచి అమ్మకాలు మొదలు
  • రెండు వేరియంట్లుగా ఫోన్ లభ్యం
  • ధర రూ.6,799, రూ.7,299
Tecno Pop 7 Pro launched in India with 5000mAh battery

చైనాకు చెందిన టెక్నో మొబైల్ తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ‘టెక్నో పాప్ 7 ప్రో’ని భారత వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ధర రూ.6,799. 3జీబీ ర్యామ్, 64జీబీ ధర రూ.7,299. ఎండ్ లెస్ బ్లాక్, ఉయూని బ్లూ రంగులలో లభిస్తుంది. అమెజాన్ పోర్టల్ పై ఈ నెల 22 నుంచి దీని అమ్మకాలు మొదలవుతాయి. 

ఫోన్ స్పెసిఫికేషన్లను గమనిస్తే.. 6.56 అంగుళాల హెచ్ డీ ప్లస్ నాచ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 480 నిట్ బ్రైట్ నెస్, ఐపీఎక్స్ 2 రేటింగ్, మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ టైప్ సీ చార్జర్ తో ఫోన్ వస్తుంది. 12 మెగాపిక్సల్ సామర్థ్యంతో వెనుక భాగంలో రెండు కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. 

More Telugu News