BCCI: పుజారాను సన్మానించిన బీసీసీఐ

BCCI facilitates Pujara
  • 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పుజారా
  • ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా సన్మానం
  • గవాస్కర్ చేతుల మీదుగా ప్రత్యేక క్యాప్ అందించిన బీసీసీఐ
టీమిండియా బ్యాట్స్ మెన్ చటేశ్వర్ పుజారా మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 100 మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. భారత్ నుంచి పుజారాతో కలిపి ఇప్పటి వరకు కేవలం 13 మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ సందర్భంగా పుజారాను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా పుజారా ప్రత్యేక క్యాప్ ను అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి పుజారా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. మరోవైపు ఈరోజు మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో పుజారాకు సహచర ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ తో గౌరవించారు. వరుసగా నిలబడి ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు.
BCCI
Cheteshwar Pujara

More Telugu News