కన్నా లక్ష్మీనారాయణపై జీవీఎల్ నరసింహారావు విమర్శలు
- కన్నాకు పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందన్న జీవీఎల్
- ఏకపక్షంగా సోము వీర్రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వ్యాఖ్య
- గతంలో తనపై కూడా కన్నా విమర్శలు చేశారని మండిపాటు
తనపై కూడా కన్నా ఎన్నో విమర్శలు చేశారని.. వాటిపై తాను మాట్లాడబోనని తెలిపారు. సోము వీర్రాజుపై కన్నా విమర్శలు గుప్పించారని... పార్టీలో సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్ఠానానికి చెప్పి తీసుకున్నవేనని అన్నారు. ఏకపక్షంగా సోము వీర్రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతానికి కన్నా గురించి ఇంతకన్నా మాట్లాడేదేమీ లేదని అన్నారు.