Blinkit: వేలంటైన్స్ డే రోజున కండోమ్స్, రోజా పువ్వులకు తెగ డిమాండ్

  • బ్లింకిట్ ప్లాట్ ఫామ్ పై జోరుగా ఆర్డర్లు
  • సాధారణ రోజులతో పోలిస్తే అధికం
  • డియోడరెంట్స్, పెర్ ఫ్యూమ్, చాక్లెట్లు, బొకేలు అధిక అమ్మకాలు
Blinkit founder reports strong sale of condoms candles on Valentines Day

ప్రేమికులకు ‘ప్రేమికుల దినోత్సవం’ ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పక్కర్లేదు. సాధారణంగా ప్రేమికులు రోజువారీ కొట్టుకున్నా, తిట్టుకున్నా, అనుమానించుకున్నా.. ఆ ఒక్క రోజు మాత్రం చెప్పలేనంత ప్రేమను కురిపించుకుంటారు. కానీ, మన యువత కండోమ్ లతోనూ ప్రేమ వ్యక్తం చేసుకుంటున్నారు!


ప్రేమికుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని దేశ, విదేశీ ప్రయాణం కట్టేవారున్నారు. పెద్ద కేక్ తీసుకొచ్చి కట్ చేసి, ప్రేమ కురిపించుకునే వారు ఉన్నారు. ప్రియమైన వారికి ఖరీదైన కానుకలు ఇచ్చేవారు ఉన్నారు. డబ్బులు తగలేయడం ఎందుకులే అని అనుకునే వారికి సింపుల్ గా రోజా పువ్వు ఉండనే ఉంది. దురదృష్టకరం ఏమిటంటే, పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా వచ్చిన వేలంటైన్స్ డే.. ప్రేమికుల హద్దులను కూడా చెరిపేస్తోంది. 

ఈ ఏడాది వేలంటైన్స్ డే రోజున ఇన్ స్టంట్ గ్రోసరీ సంస్థ బ్లింకిట్ విక్రయ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. కండోమ్స్, క్యాండిల్స్ భారీగా విక్రయమైనట్టు బ్లింకిట్ ఫౌండర్ ఆల్బిందర్ దిండ్సా స్వయంగా ట్విట్టర్ పై ప్రకటించారు. ప్రేమ పేరుతో యువతీ యువకులు శృంగారానికి కూడా రెడీ అయిపోతున్నట్టు దీన్ని బట్టి తెలుస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే వేలంటైన్స్ డే రోజున అధికంగా అమ్ముడుపోయిన ఇతర ఉత్పత్తుల్లో రోజా పువ్వులు, బాడీ డియోడరెంట్స్, మహిళలు వాడే పెర్ ఫ్యూమ్, బొకేలు, చాక్లెట్లు ఉన్నాయి. దీనిపై బ్లింకిట్ ఫౌండర్ దిండ్సా.. ‘‘ప్రేమ చూడ్డానికి గాలిలో ఉన్నట్టుంది. లేదా ఆహ్లాదకరమైన పరిమళానికా?’’ అని ట్వీట్ పెట్టారు.

More Telugu News